Ahmedabad Plane Crash: ప్రాథమిక కారణాన్ని గుర్తించిన దర్యాప్తు సంస్థలు! ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం కూలిపోయింది. దీంతో 274 మంది చనిపోయారు. సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. దర్యాప్తు సంస్థలను నియమించింది.
ఇది కూడా చదవండి: Exclusive : తమిళ హీరోలకు తెలుగు దర్శకులు అలా.. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇలా
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
అయితే ఎయిరిండియా విమాన ప్రమాదానికి విద్యుత్ వైఫల్యమే కారణంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విద్యుత్ అంతరాయం వల్లే విమానం కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇక ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. విమానం కూలిపోతున్నప్పుడు లైట్లు రెపరెపలాడుతున్నాయని… అసాధారణ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో విద్యుత్ సమస్య తలెత్తి కూలిపోయి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణ దాడి.. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు
విమానంలోని ప్రధాన విద్యుత్ వ్యవస్థలో లోపం తలెత్తి ఉంటుందని.. అందుకే విమానం కూలిపోయేటప్పుడు పెద్ద శబ్దం వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ఏటీసీ ప్రకటనలు, శిథిలాలను పరిశీలించిన తర్వాత ప్రాథమిక పరీక్షల ద్వారా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విమానంలో విద్యుత్ లోపం ఉన్నట్లు సంకేతాలు కనిపించాయని.. ఏటీసీతో వెంటనే కమ్యూనికేషన్ తెలిపోయినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా శిథిలాల దగ్గర కూడా విద్యుత్ వ్యవస్థ దగ్గర సమస్యలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా వర్గాలు తెలిపాయి. విమానం ఒక్కసారి ఎత్తు కోల్పోతున్న సమయంలో సమీపంలో ఉన్న ప్రజలు.. లైట్లు మిణుకుమిణుకుమంటూ కనిపించాయని.. అసాధారణ శబ్దాలు వినిపించాయని చెప్పారు.
ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు నిర్వహిస్తోంది. మరోవైపు హోం కార్యదర్శి అధ్యక్షతన ఒక ప్యానెల్ సమాంతర దర్యాప్తు నిర్వహిస్తోంది. ఇలా రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మేడే కాల్ ఇచ్చాడు. కానీ అప్పటికే ఏటీసీతో విమానం సంబంధం కోల్పోయింది. దీనికంతటికి కారణం విద్యుత్ సమస్యనే కారణంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు బ్లాక్ బాక్స్ బాగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. దీన్ని ఓపెన్ చేసేందుకు అమెరికాకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతులు రావల్సి ఉంటుంది.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?