Taj Mahal: తాజ్‌మహల్‌కు తొలిసారిగా ఇంటి పన్ను నోటీసులు.. రూ.1.4 లక్షలు కట్టాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taj Mahal: ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి నోటీసులు జారీ చేశారు. తాజ్‌మహల్‌పై బకాయి ఉన్న రూ.1.4 లక్షల ఇంటి పన్ను చెల్లించాలని గత నెలలో నోటీసు జారీ చేసినప్పటికీ అది కొద్ది రోజుల క్రితమే అందింది. బకాయిలను క్లియర్ చేయడానికి ASIకి 15 రోజుల గడువు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పన్నును క్లియర్ చేయకుంటే తాజ్‌మహల్‌ను అటాచ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంటి పన్ను మొత్తంలో బకాయిపై వడ్డీగా రూ.47వేలను కూడా చేర్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఇంటి పన్ను రూ.11,098 అని వివరించారు.
Read Also: CM Jagan: నాటా తెలుగు సభలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
అయితే మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ హయాం నుంచి ఇప్పటివరకు పన్ను కట్టమని నోటీసులు పంపలేదని ఇదే మొదటిసారని వాపోతున్నారు. తాజ్‌మహల్‌ను రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారని.. అందుకే ఈ పన్నును విధించారేమోనని ఏఎస్ఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆగ్రాలోని మొఘల్ సమాధి అయిన ‘టోంబ్ ఆఫ్ ఇత్మాద్-ఉద్-దౌలా’పై కూడా ఇంటి పన్ను బకాయి చెల్లించేందుకు ఇదే నోటీసు వచ్చిందని, ఇది కూడా రక్షిత స్మారక చిహ్నంగా ఉందని అధికారులు వివరించారు. ఈ సమాధిని ‘బేబీ తాజ్’ అని కూడా పిలుస్తారు. ఈ సమాధిని మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య నూర్జహాన్ తన తండ్రి కోసం నిర్మించారు. కాగా జాతీయ స్మారక చిహ్నాలపై ఎలాంటి పన్ను విధించడానికి వీల్లేదని.. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ పొరపాటుగా ఈ నోటీసులు పంపి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఓ ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు చెప్తున్నారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!