కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అంతర్గత విభేధాలు భగ్గుమన్నాయి. అమరిందర్ సింగ్ ను అధికారపార్టీకి చెందిన కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సునీల్ ఖాజర్ ముఖ్యమంత్రిని ప్రముఖంగా విమర్శంచే వారిలో ఉన్నారు. ఆయనతో పాటుగా కొంతమంది అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అమరిందర్ సింగ్‌పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సిద్థూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు.
Read: నేడు దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
గత కొంతకాలంగా సిద్ధూ పార్టీలో ఉన్నప్పటికీ, పార్టీ పనులకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి సిద్ధూ తనవంతు ప్రచారం నిర్వహించి సక్సెస్ అయ్యారు. సిద్దూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రావడం మొదల్లయ్యాయి. గతంలో ఇలాంటి విభేధాలు వచ్చిన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం సర్ధిచెప్పడంతో సునీల్ మొత్తపడ్డాడు. మరలా ఇప్పుడు మరోసారి అంతర్గత విభేదాలు తలెత్తడంతో అమరిందర్ సింగ్ ఢిల్లి బయలుదేరి వెళ్లారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు.