నేడు దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి జిల్లాలో ప‌ర్యటించబోతున్నారు. ఈనెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప‌ర్యట‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ యాదాద్రిలో ప‌ర్యటించ‌బోతున్నారు సీఎం కేసీఆర్‌. యాదాద్రి జిల్లా తుర్కప‌ల్లి మండ‌లంలోని వాసాలమ‌ర్రి గ్రామాన్ని సీఎం దత్తత తీసుకున్నారు. ద‌త్తత తీసుకున్న గ్రామంలో ఇవాళ ప‌ర్యటించ‌నున్నారు.

read also : కేసీఆర్‌వి కొత్త అబద్ధాలు… తుగ్లక్ వాగ్దానాలు : రాములమ్మ సెటైర్‌

ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ గ్రామ స‌ర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామంలో స‌మూహిక భోజ‌నాలు చేసిన అనంత‌రం గ్రామ‌స‌భ‌ను ఏర్పాటు చేసి స‌మ‌స్యల‌పై చర్చిద్దామ‌ని సీఎం కేసీఆర్… గ్రామ స‌ర్పంచ్‌కు ఫోన్‌లో తెలిపారు. ఇక ఇప్పటికే యాదాద్రి జిల్లా క‌లెక్టర్ ఆ గ్రామంలో సీఎం కేసీఆర్ ప‌ర్యట‌న‌కు సంబందించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-