Sri lanka: అదానీ ప్రాజెక్టులో అమెరికా భారీ పెట్టుబడులు.. చైనాకు చెక్ పెట్టేందుకు వ్యూహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri lanka: ఇండియా మిత్రదేశం శ్రీ లంకలో నానాటికి పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుక భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు తీసుకున్న చైనా అక్కడి నుంచి భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్ రీజియన్‌లో నిఘా పెంచుతోంది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాతో జట్టు కట్టింది.
ఈ నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబోని నౌకాశ్రయ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి అమెరికా డీఎఫ్‌సీ 553 మిలియన్ డాలర్లను నిధులను సమకూర్చుతోంది. కొలంబోలోని డీప్ వాటర్ వెస్ట్ కంటైనర్ టెర్మినల్(డబ్ల్యుసీటీ) లో పెట్టుబడులు పెట్టనుంది. ఆసియాలో అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే. ఇది శ్రీలంక అభివృద్ధితో పాటు, భారతదేశంతో సహా ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహిస్తుందని, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (DFC) ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
Read Also: Isreal-Hamas War: తోటి ప్రజాప్రతినిధి వ్యాఖ్యలపై సెన్సార్.. అమెరికా ప్రతినిధుల సభలో కీలక పరిణామం..
ఈ ప్రాజెక్టులో అదానీకి 51 శాతం వాటా ఉండగా.. శ్రీలంక సంస్థ జాన్ కీల్స్ హెల్డింగ్స్ 34 శాతం వాటాను కలిగగి ఉంది. మిగిలిన మొత్తం శ్రీలంక ప్రభుత్వ ఆధ్వర్యంలోని శ్రీలంక పోర్ట్స్ అథారిటీకి వాటాగా కలిగి ఉంది. గతేడాది చైనా శ్రీలంకలో 2.2 బిలియన్ల పెట్టుబడి పెట్టింది. దీంతో పాటు చైనా రుణ ఉచ్చులో ఇరుకున్న శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు ఇచ్చింది. తాజాగా కొలంబో పోర్టులో భారత్, అమెరికాలు కలిసి పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనాకు చెక్ పెట్టవచ్చు. హిందూ మహాసముద్రంలో అత్యంత రద్దీగా ఉండే పోర్టుల్లో కొలంబో ఒకటి.
గతేడాది నుంచి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను భారత్ ఆదుకుంది. 4 బిలియన్ల క్రెడిట్ లైన్‌లను విస్తరించింది. ఇంధనం, ఔషధం, ఎరువులు దిగుమతుల్లో మద్దతుగా సాయం చేసింది. ఇదిలా ఉంటే జూలై నెలలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పర్యటించారు. ఆ సమయంలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. కొలంబో పోర్టులోని డబ్ల్యూసీటీ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టుతో పాటు 500 మెగావాట్ల విండ్ ప్రాజెక్టు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం వంటి ప్రాజెక్టుల గురించి చర్చించారు.
- Tags
- Adani group
- china
- DFC
- india
- Sri Lankan
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..