Sri lanka: ఇండియా మిత్రదేశం శ్రీ లంకలో నానాటికి పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుక భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు తీసుకున్న చైనా అక్కడి నుంచి భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్ రీజియన్‌లో నిఘా పెంచుతోంది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాతో జట్టు కట్టింది.