Toilet Tax: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ టాయిలెట్ ట్యాక్స్’’ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. అయితే, దీనిపై సీఎం సుఖ్వీందర్ సుఖూ స్పందించారు. రాష్ట్రొలో అలాంటి ట్యాక్స్ ఏం లేదని సమాధానం ఇచ్చారు.