Rajasthan: బోరు బావిలో పడిన బాలుడి కోసం 57 గంటల రెస్క్యూ.. చివరకు ప్రాణాలు కోల్పోయిన ఆర్యన్
- రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో బోరు బావిలో పడ్డ ఐదేళ్ల బాలుడు..
- 57 గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీసిన రెస్య్కూ టీమ్స్..
- బాలుడు ఆర్యన్ కి పలు వైద్య పరీక్షలు చేసిన తర్వాత మరణించినట్లు నిర్దారించిన వైద్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: ఆడుకుంటూ వెళ్లిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల లోతులో గల బోరు బావిలో పడిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఇక, బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల కష్టపడింది. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన రెస్య్కూ ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. అయితే, అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని హస్పటల్ కి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన వైద్యులు బాలుడు మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దౌస జిల్లాలో జరిగింది.
Read Also: Amit Shah: రేపటి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటన.. నక్సల్స్ వ్యతిరేక చర్యలపై సమీక్ష
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ఇక, రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోని కాలిఖండ్ అనే గ్రామంలో సోమవారం నాడు ఐదేళ్ల బాలుడు ఆర్యన్ మధ్యాహ్నం 3గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ గంట తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. ఆ బాలుడి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు, జేసీబీలు, డ్రిల్లింగ్ మెషిన్లతో ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో కంటిన్యూగా మట్టి తవ్వుతుంటే.. మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆ బాలుడికి ఆక్సిజన్ పంపించారు.
Read Also: Gabba Test: గబ్బాలో పేస్, బౌన్స్.. టీమిండియాకు పరీక్ష తప్పదు! 61 టెస్టుల్లో ఏడు సార్లు మాత్రమే
అయితే, ఈ రెస్య్కూ ఆపరేషన్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. దాదాపు 160 అడుగుల వరకు నీటి మట్టం ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ అంచనా వేసింది. భూమి లోపల ఆవిరి కారణంగా బాలుడి కదలికలను కెమెరాలో బంధించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే సమయంలో భద్రతా సమస్యలు కూడా తలెత్తుతాయని అధికారులు అంచనా వేశారు. అయినా కూడా, 57 గంటల పాటు శ్రమించి బోరుబావి నుంచి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆర్యన్ సేఫ్ గా బయటకు తీశారు. గ్రీన్ కారిడార్ ద్వారా అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో కూడిన అంబులెన్స్‌లో ఆర్యన్‌ను హస్పటల్ కి తరలించినప్పటికి.. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!