కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. రోజుకు లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ కు డిమాండ్ ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో కొరతను ఎదుర్కొంటున్నారు. తగినన్ని వ్యాక్సిన్లు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉన్నది. దీంతో అర్హులైన వారికి జాగ్రత్తగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లోని శాస్త్రినగర్ లోని ఓ ఆసుపత్రిలో 320 వ్యాక్సిన్లు చోరీకి గురయ్యాయి. దీంతో ఆసుపత్రి వర్గాలు షాక్ అయ్యాయి. ఎలా చోరీకి గురయ్యాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వ్యాక్సిన్ చోరీపై ఆసుపత్రి యాజమాన్యం విచారణ చేపట్టింది. త్వరలోనే విషయాలు తెలుసుకుంటామని చెప్పారు.