Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి భారీ షాక్.. బీజేపీలోకి ముగ్గురు నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బీజేపీలోకి కాంగ్రెస్ వలసలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అస్సాంలోని కీలక కాంగ్రెస్ నేతలు ముగ్గురు కాషాయ కండువా కప్పుకున్నారు. అస్సాం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సహా ముగ్గురు నేతలు ఈ రోజు కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు.
అస్సా పీసీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి మనష్ బోరా పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి తన రాజీనామా లేఖ పంపారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPCC) అస్సాం అధ్యక్షుడు గౌరవ్ సోమాని కూడా శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జోర్హాట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్‌కు సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరు యువ నేతలు రాజీనామా చేయడం విశేషం. వీరితో పాటు చరైడీవో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకుడు అనూజ్ బర్కటాకీ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Read Also: Pawan Kalyan: దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతా..
బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భజేష్ కలితా, కేబినెట్ మంత్రులు పిజూష్ హజారికా, జయంత మల్లబరువా, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మనష్ బోరా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వం తనను పార్టీ వైపు ఆకర్షించిందని అన్నారు. కాంగ్రెస్‌కి క్షేత్రస్థాయిలో సంబంధాలు లేకుండా పోయాయని, కొద్ది మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ భట్టాచార్య కూడా పార్టీని వీడారని, ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు ఇలా కాంగ్రెస్ కీలక నేతలు బీజేపీలో చేరుతున్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!