దేశంలోని హోటల్ పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన తాజ్ హోటల్ మళ్లీ ఉగ్రవాదుల టార్గెట్‌గా మారింది. అయితే 2008లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి లక్నోలోని తాజ్ హోటల్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సోమవారం హజ్రత్‌గంజ్‌లోని ఈ హోటల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ హోటల్‌లో బాంబు లేదా ఉగ్రవాద దాడి గురించి మాట్లాడినప్పుడల్లా.. 2008 సంవత్సరం యొక్క భయంకరమైన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.
Taj Hotel Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం నాడు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఇదివరకే నగరంలోని 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్‌కు పంపిన ఇమెయిల్‌లో ఆవరణలో బాంబు పేలుడు సంబంధిత విషయం ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు నివేదించాయి. ఆదివారం (అక్టోబర్ 27) లక్నోలోని 10 హోటళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా సోదా చేసింది. అయితే,…
Taj Hotel : టాటా గ్రూప్‌కు చెందిన తాజ్ హోటల్ గ్రూప్‌పై నవంబర్ 5న సైబర్ దాడి జరిగింది. తాజ్ హోటల్‌కు చెందిన దాదాపు 15 లక్షల మంది వినియోగదారుల డేటా తమ వద్ద ఉందని హ్యాకర్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
Threat call: ముంబైలోని ప్రముఖ తాజ్ హోటల్‌ని పేల్చేస్తామని పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. ఇద్దరు పాకిస్తానీయులు నగరానికి చేరుకుని తాజ్ హోటల్ని పేల్చివేస్తారని బెదిరిస్తూ ముంబై పోలీసుకలు బెదిరింపులు ఎదురయ్యాయి. సముద్రమార్గం ద్వారా వీరు ముంబైకి చేరుకున్నారని గురువారం ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాతవ్యక్తి కాల్ చేశాడు.
26/11 Mumbai Terror Attacks - UN Global Congress of Victims of Terrorism: ముంబై 26/11 ఉగ్రదాడుల బాధితులు యూఎన్ మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఆవేదనను యూఎన్ లో వినిపించారు. తమకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఇచ్చారు. ఈ దారుణ ఘటనలో నేను సర్వస్వం కోల్పోయానని అప్పటి తాజ్ హోటల్ మేనేజర్ గా పనిచేసిన కరంబీర్ కాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు.…
అడివి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ ‘ఎవరు’ వంటి సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరి హీరోల్లా కాకుండా వినూత్నమైన సినిమాలను తీస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 26/11 ముంబై నగరంలో తాజ్ హోటల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను తాజ్ హోటల్‌లోనే చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేశారట.…