Maoists Surrender: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈ రోజు ( ఏప్రిల్ 18న) 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందన్నారు పోలీసులు. మావోయిస్టు భావజాలం, స్థానిక గిరిజనులపై జరిగిన దురాగతాలతో నిరాశ చెందడంతోనే 22 మంది సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పుకొచ్చారు. వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారని వెల్లడించారు.
Read Also: Bhumana Karunakar Reddy: ఒక్క కేసు కాదు.. మరో 100 కేసులు పెట్టిన భయపడేది లేదు..
ఇక, లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలిటరీ డిప్యూటీ కమాండర్ ముచాకీ జోగా, స్వ్కాడ్ సభ్యురాలు.. అతని భార్య ముచాకీ జోగా కూడా ఉన్నారు. వీరిపై రూ.8 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి బుధ్రాలపై రూ.5 లక్షల రివార్డు ఉంది.. మరో 7 మందిపై రూ.2 లక్షల రివార్డు, ఒకరిపై రూ.50 వేలు రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. వీళ్లందరికీ ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సాయం అందించాం.. అలాగే, ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. కాగా, గత ఏడాది సుక్మాతో సహా బస్తర్ ప్రాంతంలో దాదాపు 792 మంది మావోయిస్టులు లొంగిపోయారు.