సర్పంచ్ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ స్థానానికి తల్లీకూతుళ్లు పోటీకి దిగారు. తల్లి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ నామినేషన్ దాఖలు చేశారు. తిమ్మయ్యపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళ రిజర్వ్ చేశారు. పల్లెపు సుమ అదే గ్రామానికి చెందిన అశోక్‌ను 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఇరు కుటుంబ మధ్య కలహాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు…
Maoists Surrender : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. దక్షిణ బస్తార్ ప్రాంతానికి చెందిన మొత్తం 37 మంది మావోయిస్టులు అధికారుల ముందు లొంగిపోయారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో ఈ లొంగుబాట్లు నమోదయ్యాయి. లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉండటం విశేషం. వీరిలో పలువురిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే మరో 10 మంది మిలీషియా సభ్యులు…
మెట్రో దగ్గర ఫేక్ దందా..పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నకిలీ సిబ్బంది.. ప్రజలను బురిడీ కొట్టించేందుకు.. నకిలీ రాయుళ్లు ఎక్కడిపడితే అక్కడ రెడీగా ఉంటున్నారు. ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ వ్యక్తి.. వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో నకిలీ వసూళ్ల పర్వం బయటపడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఇలాంటి బురీడీ రాయుళ్లు ప్రతినిత్యం మనకు ఎక్కడో ఓ చోట తారసపడుతుంటారు. ప్రతి ఒక్క…
DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను అణిచివేయడానికి ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, నిరంతర ఆపరేషన్లు వేగంగా ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా మరో భారీ లొంగుబాటు చోటుచేసుకుంది. మొత్తం 37 మంది మావోయిస్టులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ వివరాలను వెల్లడించారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన పిలుపుతో మావోయిస్టులు బయటికి వస్తున్నారని చెప్పారు. శాంతియుత…
Maoists Surrender : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభుత్వం నడుపుతున్న ఆపరేషన్లు మరోసారి పెద్ద ఫలితాన్ని సాధించాయి. మొత్తం 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా కీలక నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా అధికారుల ముందుకు వచ్చాడు. ఏవోబీ (ఆంధ్ర–ఒడిశా సరిహద్దు) ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన ఆజాద్, గత కొంతకాలంగా భద్రతా దళాల నిఘాలోనే ఉన్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు.…
Maoists : ములుగు జిల్లాలో నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. వారు జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఎదుట తమ ఆయుధాలను వదిలి, సాధారణ జీవితం వైపు అడుగులు వేసే నిర్ణయం తీసుకున్నారు. లొంగుబాటు అయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు…
Maoists Surrender: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈ రోజు ( ఏప్రిల్ 18న) 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందన్నారు పోలీసులు.
కరీంనగర్ సీపీ, ప్రస్తుత ఇంచార్జ్ వరంగల్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సమక్షంలో ఇద్దరు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు తిక్క సుష్మిత అలియాస్ చైతే ఏరియా కమిటీ మెంబర్గా, మడకం దూల ఏరియా కమిటీ మెంబర్గా పనిచేశారు.