Modi Surname Case: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Surname Case: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో శిక్షను ఎదుర్కోనున్నారు. శిక్ష విధించిన తర్వాత సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు రోజు సూరత్ కు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
‘షేర్-ఎ-హిందుస్తాన్’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2019లో లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో జరిగిన ర్యాలీలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటి పేరు ఎలా వచ్చింది..?’’ అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఫిర్యాదు చేశారు.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
Read Also: Pregnancy: ప్రెగ్నెన్సీ రాకుండా కొత్త సాధనం.. తెలుగు రాష్ట్రాల్లో అమలు..?
ఈ కేసుపై చీఫ్ జ్యడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ కోర్టు గత వారం ఇరుపక్షాల తుది వాదనలను విన్నారు. నాలుగేళ్ల నాటి పరువు నష్టం కేసులో తాజాగా ఈ రోజు తీర్పు చెప్పారు. రాహుల్ గాంధీ తరుపున న్యాయవాది కిరీత్ సన్వాలా కోర్టులో తన వాదనలు వినిపించారు. అంతకుముందు మార్చి 23న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 499,500 కింద దాఖలు చేసిన కేసులో రాహుల్ గాంధీ చివరిసారిగా 2021 అక్టోబర్ లో తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి సూరత్ కోర్టు హాజరయ్యారు.
గురువారం పార్లమెంట్ వెలుపల కోర్టు ఆదేశాలపై మాట్లాడారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. రాహుల్ వైఖరి కారణంగా కాంగ్రెస్ బాధలు పడుతోందని అన్నారు. రాహుల్ చెప్పేది ఎల్లప్పుడూ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉంటుందని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీని వేధిస్తున్నారని, చివరకు సత్యమే గెలుస్తుందని చెబుతోంది. రాహుల్ గాంధీ తరుపు న్యాయవాది మాట్లాడుతూ కేసు మొదటి నుంచి లోపభూయిష్టంగా ఉందని, ఆయన ప్రధానిని టార్గెట్ చేస్తూ మాట్లాడారని, ఈ కేసులో ఫిర్యాదుదారుగా ప్రధాని ఉండాలని, ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ కాదని అన్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!