దేశంలోని పసిడి ప్రియులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. లక్ష రూపాయలకు పైగా ఎగబాకిన పసిడి రేట్లు.. రోజు రోజుకు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 90 వేలకు దిగొచ్చింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శనివారం (జూన్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,300గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,420గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,300గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,420గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.89,450గా.. 24 క్యారెట్ల ధర రూ.97,570గా నమోదైంది. ప్రాంతాల వారీగా పసిడి ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే అంశమనే చెప్పాలి.
Also Read: Visakhapatnam: గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట!
మరోవైపు వెండి ధర కూడా ఊరటనిస్తోంది. ఇటీవల స్థిరంగా లేదా తగ్గుతూ వస్తోంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై స్వల్పంగా వంద తగ్గి.. రూ.1,07,800గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,17,800గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి రూ. 1,07,800గా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన ధరలు ఇవి.