Himachal Pradesh: శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం.. కారు వాగులో కొట్టుకుపోయి 11 మంది మృతి
- హిమాచల్ ప్రదేశ్ లో విషాదం
- వాగులో గల్లంతై ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి
- వివాహ శుభకార్యానికి అని బయల్దేరిన 12 మంది కుటుంబ సభ్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చావు ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు.. ఓ వివాహ వేడుకకు అని బయల్దేరిన ఒకే కుటుంబానికి చెందిన 12 మంది సభ్యుల్లో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భటోలి గ్రామానికి చెందిన వీరంతా ఓ వివాహ శుభకార్యానికి అని బయల్దేరారు. అయితే.. మార్గమధ్యలో జెజో ప్రాంతంలో వాగులో పడి ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 11 మంది చనిపోగా.. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Also: Trai New Rule: ఇకపై అలాచేస్తే మీ సిమ్ 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్‌లో..
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
మృతులు సుర్జీత్ సింగ్ (55), పరమజీత్ కౌర్ (50), గగన్‌దీప్ (19), దీపక్ (22), రామ్ స్వరూప్, పల్వీందర్ కౌర్, నితిన్, శీను దేవి, అమ్రిక్ సింగ్, హర్షిత్, భావన, మన్నత్ గా గుర్తించారు. వీరంతా ఓ కారును బుక్ చేసుకుని మెహ్రోవాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. జైజోన్ అనే ప్రాంతంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. వాగు ఉధృతిని చూసిన డ్రైవర్.. కాసేపు ఆగి వెళ్దామనుకున్నాడు. అయితే కొన్ని వాహనాలు ఆ వరద నీటిని దాటి వెళ్తుండటంతో వారు కూడా వెళ్లాలని భావించారు.
Read Also: Medchal: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి..
కానీ వాగు ఉధృతి అధిక వేగంతో ప్రవహిస్తుండటంతో కారు నీటిలో కొట్టుకుపొయింది. అది చూసిన స్థానికులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆ కారులో ప్రయాణిస్తున్న దీపక్‌ను మాత్రే బయటకు తీయగలిగారు. మిగతా వాళ్లను రక్షించలేకపోయారు. అయితే.. కారులో కొట్టుకుపోయిన వారిలో తొమ్మిది మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇంకా ఇద్దరి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. సీఎం సుఖు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. “జెజో (హిమాచల్-పంజాబ్ సరిహద్దు) సమీపంలో వరద ప్రవాహం కారణంగా ఉనా జిల్లాలోని డెహ్లాన్ గ్రామానికి చెందిన సుమారు 11 మంది ప్రమాదానికి గురయ్యారు. నేను స్థానిక పరిపాలనతో సంప్రదింపులు జరుపుతున్నాను. సహాయ మరియు సహాయక చర్యలు బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించాలని, ఈ కష్టకాలంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి” అని తెలిపారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!