India Not A Nation: “భారత్ ఒక దేశం కాదు”.. డీఎంకే నేత రాజా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా కూటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Not A Nation: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి డీఎంకే సీనియర్ నేత ఏ రాజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రాజా.. తాజాగా ‘‘ఇండియా ఒక దేశం కాదు’’ అని అన్నారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మరోవైపు ఇండియా కూటమి నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ ఈ వ్యాఖ్యల్ని ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని చెప్పింది. రాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటేని ప్రశ్నించగా.. అతని వ్యాఖ్యలతో తాను 100 శాతం ఏకీభవించనని అన్నారు. రాముడు అందరికీ చెందిన వాడని, అందరినీ కలుపుకుని పోయేవాడని నేను నమ్ముతానని అన్నారు. ఇండియా కూటమిలో ఆర్జేడీ పార్టీ చీఫ్ తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇది అతని వ్యక్తిగత ప్రకటన అని, ఇది కూటమిని ఉద్దేశించవని అన్నారు.
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజా ప్రసంగిస్తూ.. ‘‘భారతదేశం ఒక దేశం కాదు, దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక దేశం ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతిని సూచిస్తుంది. ఇలాంటి లక్షణాలు మాత్రమే ఒక దేశాన్ని తయారు చేస్తాయి. తమిళనాడుకు వస్తే, ఒక సంస్కృతి ఉంది, కేరళలో, మరొక సంస్కృతి ఉంది, ఢిల్లీలో మరొకటి ఉంది.’’ అంటూ వ్యాఖ్యానించారు. జైశ్రీరాం, భారత్ మాతాకీ జై అనే నినాదాలను మేము ఎప్పటికీ అంగీకరించబోమని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. డీఎంకే ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరంతరం కొనసాగుతున్నాయని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చాడని, ఇప్పుడు భారతదేశాన్ని ‘‘బాల్కనైజేషన్’’ చేయాలని ఆ పార్టీ నేత ఏ రాజా పిలుపునిస్తున్నాడని, భగవాన్ రామ్‌ని అవహేళన చేస్తున్నాడని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్, ఇండి కూటమి ఈ వ్యాఖ్యల్ని అంగీకరిస్తుందా..? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!