UtterPradesh: షాపుల దగ్గర, హోటల్స్ దగ్గర చిన్న విషయాలు ఒక్కోసారి చాలా సీరియస్‌గా మారుతాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర ఘటనలు జరిగడానికి దారితీస్తాయి. కొద్ది రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో టోల్‌గేట్ సిబ్బందిలో ఒకరు రూ. 100 ఇతరులకు తెలియకుండా తీశారని.. ఆ తరువాత సీసీటీవీ ఫుటేజ్ లో చూసి అతనిపై దాడి చేసి చనిపోయేలా కొట్టారు. ఇది కేవలం రూ. 10 కోసం జరిగిన గొడవ.. అదికాస్త ముదిరి పాకానపడి.. ఏకంగా దుకాణదారున్ని నిందితులు కాల్పులు జరిపి చంపే వరకు వెళ్లింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
Read also: Pawan Kalyan: ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరకూడదంతే..!
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురిలో ఈ ఘటన వెలుగు చూసింది. కేవలం రూ.10 కోసం చెలరేగిన వివాదం ఓ దుకాణదారుని ప్రాణాలు తీసింది. అతడిని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
జూన్ 12న ఈ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత మంగళవారం జూన్ 27,గుల్ఫామ్‌ను పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలను అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ తెలిపారు. జాతవ్ తన దుకాణంలో పెట్రోల్‌తో పాటు ఇతర వస్తువులను విక్రయించేవాడని గుల్ఫామ్ వెల్లడించాడు. ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు గుల్ఫామ్ జాతవ్ దగ్గర పెట్రోల్ కొనుగోలు చేశాడు. డబ్బులు ఇచ్చాడు.. అయితే గుల్ఫామ్ ఇచ్చిన డబ్బుల్లో పది రూపాయలు తక్కువయ్యాయి. ఈ విషయంపై జాతవ్.. గుల్ఫామ్ ను నిలదీశాడు.
బ్యాలెన్స్ మొత్తం ఇవ్వాలంటూ గుల్ఫామ్ ను జాతవ్ అడిగాడు. అందుకు అతను నిరాకరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదానికి దారితీసింది. మహేశ్‌చంద్ జాతవ్.. గుల్ఫామ్‌ను డబ్బులు మొత్తం ఇవ్వకపోతే అంతుచూస్తా అని బెదిరించాడని నిందితులను విచారించిన తర్వాత పోలీసులు తెలిపారు. జాతవ్ బెదిరించడంతో, గుల్ఫామ్ తీవ్ర కోపానికి వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 12 రాత్రి జాతవ్‌ను కాల్చి చంపాడు. 12న కాల్చి చంపిన ఘటనలో నిందితులను ఈ నెల 27న పోలీసులు అరెస్టు చేశారు.