Teacher Jobs In Bihar: సాధారణంగా ఉపాధ్యాయ(టీచర్) పోస్టులను భర్తీ చేసేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న వారితోనే భర్తీ చేస్తారు. టీచర్ పోస్టు జిల్లాస్థాయి పోస్టు. కాబట్టి సొంత రాష్ట్రంలోని వారితో భర్తీ చేస్తారు. రాష్ట్ర చరిత్రను బోధించాల్సి ఉంటుంది.. అలాగే తమ సొంత రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. చాలా రాష్ట్రాలు 100 శాతం వారి రాష్ట్రం వారితో భర్తీ చేస్తారు. భర్తీకి సంబంధించి జారీ చేసే నోటిఫికేషన్‌లో స్థానికతపై స్పష్టంగా పేర్కొంటారు. కానీ ఇపుడు బీహార్‌లో భర్తీ చేయబోయే 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టులకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు ఈ ప్రకటనపై ఆసక్తి చూపుతున్నారు. అయితే బీహార్‌లో టీచర్ పోస్టుల భర్తీ కోసం ఇతర రాష్ట్రాల వారు ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారో చూడాలి..
Read also: Loan App Harassment: నిజామాబాద్ లో లోన్ యాప్ వేధింపులు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో నిరుద్యోగులకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పెద్ద శుభవార్త చెప్పారు. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో భర్తీ చేయబోయే ఉపాధ్యాయ పోస్టులకు స్థానికులే కాకుండా ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు బిహార్ క్యాబినెట్ సెక్రటేరియట్ అడిషినల్ చీఫ్ సెక్రటరీ ఎస్.సిద్దార్థ్ తెలిపారు. గతంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా స్థానికులను మాత్రమే నియమించుకొనేవారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండబోదని సిద్ధార్థ్ వెల్లడించారు. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో అర్హత కలిగిన భారతీయ పౌరులు ఎవరైనా బిహార్‌లోని 1.78 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు.
Read also: Surekha Vani : సురేఖ వాణి కెరీర్ పాడు చేసింది ఆ స్టార్ హీరోనా?
ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోని మొత్తం 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మే 2న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. అయితే, స్థానికులకే కాకుండా రాష్ట్రేతరులను ఉద్యోగాలకు అనుమతించాలని విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ఈ ప్రతిపాదనపై మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని కూడా ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీహార్ రాష్ట్రంలో 85,477 ప్రైమరీ టీచర్లు, 1,745 మాధ్యామిక టీచర్లు, 90,804 హైస్కూల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీహార్ రాష్ట్ర పాఠశాల ఉపాధ్యాయ (నియామకం, బదిలీ, క్రమశిక్షణా చర్యలు మరియు సేవా పరిస్థితి) (సవరణ) నిబంధనలు 2023 ప్రకారం.. నియమితులైన అన్ని రకాల పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక జిల్లా కేడర్‌లతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైన హోదాను కలిగి ఉంటారని పేర్కొంది. 2006 నుంచి నియమితులైన వారు పంచాయితీ రాజ్ సంస్థలు (PRIలు) కూడా ఈ కేడర్‌లో చేరే అవకాశం ఉంటుందని.. అయితే దాని కోసం వారు కూడా పరీక్ష రాయాల్సి ఉంటుందని అధికారి తెలిపారు.