ZEE 5 : ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో రాబోతోంది. ZEE5 డెవలప్‌మెంట్‌లో ఇదే కీలకం కాబోతోంది. ‘మన భాష – మన కథలు’ అనే పున: ప్రారంభంతో భారతీయ సంస్కృతిలోని బోలెడు కథలను అన్ని భాషల వారికి అర్థమయ్యే విధంగా చెప్పేందుకు ఇంపార్టెన్స్ ఇస్తూ టెక్నికల్ మార్పులు చేస్తోంది జీ5. కొత్త విజువల్ ఐడెంటిటీ, ప్రొడక్ట్‌ను ఎక్స్ పీరియన్స్ తో అన్ని భాషల్లో విజువలైజ్ చేయబోతున్నారు.
Read Also : HHVM : అవన్నీ అవాస్తవం.. రిలీజ్ డేట్ పై ‘వీరమల్లు’ క్లారిటీ
అన్ని భాషల్లో ఉండే లోకల్ మేడ్ కంటెంట్ తో వస్తున్నామని జీ5 ప్రకటించింది. జీ5 ప్రెసిడెంట్ అమిత్ గోయెంకా మాట్లాడుతూ ‘‘మా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ సంస్థను మరింత బలోపేతం చేస్తుంది. అన్ని భాషల వారికి అర్థమయ్యే విధంగా లోకల్ కంటెంట్ ను ప్రోత్సహించేందుకు రెడీ అయ్యాం. పురాణాలు, ప్రాంతీయ కథల ఆధారంగా కంటెంట్ ను రూపొందిస్తాం. ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునే కథల ఆధారంగా కంటెంట్ ను రెడీ చేస్తాం. టెక్నికల్ గా వాళ్లకు అనుకూలమైన ఏఐ ఆధారిత ప్రాసెస్ ను ఫాలో అవుతున్నాం అంటూ తెలిపారు.
Read Also : Akhanda 2 Teaser : అఖండ-2 టీజర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే..