Akhanda 2 Teaser : నందమూరి బాలయ్య హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ-2 టీజర్ వచ్చేసింది. మొదటి నుంచి భారీ హైప్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటిస్తుండగా.. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి టీజర్ రానే వచ్చేసింది.
Read Also : Balakrishna Fans : థియేటర్లోకి బీర్, ఇడ్లీ.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా
హైందవం ఉట్టి పడేలా టీజర్ ను కట్ చేశారు. బాలయ్య మాస్ పల్స్, రౌద్రం అన్నీ కలబోసినట్టు టీజర్ ను రెడీ చేశారు. బాలయ్య ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ టీజర్ లో నింపేశారు. మొదటి పార్టు అఖండ భారీ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా పార్ట్-2ను తీస్తున్నారు. రీసెంట్ గానే జార్జియాలో భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా.. మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also : Tammudu : తమ్ముడు ట్రైలర్ వచ్చేది ఆ రోజే..