ఒకప్పుడు హీరో బర్త్ డే కోసం ఎదురు చూసేవాళ్లు ఫ్యాన్స్. సినిమా గురించి స్పెషల్ వీడియోనో, ఎనౌన్స్ మెంటో వస్తుందని. కానీ ఇప్పుడు డైరెక్టర్ వంతు వచ్చింది. వారికి కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. అందుకే దర్శకుడి పుట్టిన రోజున కూడా వీడియోలు రిలీజ్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతోంది కోలీవుడ్. రీసెంట్లీ లోకేశ్ కనగరాజ్ బర్త్ డే సందర్బంగా ఓ వీడియోను వదిలింది కూలీ ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్.
Also Read : Sushant : మిస్టరీగానే మిగిలిపోయిన యంగ్ హీరో సూసైడ్
లోకేశ్ కనగరాజ్ సినిమాలన్నీంటిలో బీటీఎస్ సీన్స్ కొన్నింటిని కలిపి మాస్ ట్రీట్ ఇచ్చింది ఖైదీ నుండి కూలీ వరకు సెట్స్‌లో లోకేశ్, సినిమా సీన్స్‌తో కూడిన వీడియో చేసి వదిలింది. ఇందులో లోకేశ్‌లో డైరెక్టర్ కన్నా యాక్టర్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. వీడియోలోనే అతడికి సూపర్ ఎలివేషన్ ఇచ్చారు. దీంతో ఆటోమేటిక్‌గా కూలీ ప్రాజెక్ట్ పై అంచనాలు డబులవుతున్నాయి. ఇక కార్తీక్ సుబ్బరాజ్‌కు, వారి ఫ్యాన్స్‌కు కూడా మస్త్ ట్రీట్ ఇచ్చింది రెట్రో యూనిట్. కార్తీక్ బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. సినిమా పట్ల దర్శకుడికి ఎంత పాషన్ ఉందో వీడియోలో కనిపిస్తోంది. సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న మూవీ మే 1న విడుదల కాబోతుంది. ఇలా ఫిల్మ్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్ వీడియోలతో ఇటు రెట్రో, కూలీపై ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్టును తాకుతున్నాయి. మరీ రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి.