Yash19: యష్ బాస్.. ఈసారి అయినా మొదలు పెడతాడా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash19: కెజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాకింగ్ స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యష్. సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన యష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మారాడు. కెజిఎఫ్ సినిమాతో యష్ జీవితమే మారిపోయింది. ఇక కెజిఎఫ్ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక కెజిఎఫ్ 2 తరువాత యష్ కొత్త సినిమాను ప్రకటించిందే లేదు. దాదాపు ఆ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఇంకా యష్ 19 ను అధికారికంగా ప్రకటించింది లేదు. కెజిఎఫ్ తరువాత అంతకుమించిన కథతో రావాలి కానీ, నార్మల్ కథలతో రాకూడదు అని అలాంటి కథ కోసం ఎదురుచూస్తూ ఇన్నిరోజులు ఆగాడు యష్. ఇక అలాంటి కథ దొరకడంతో యష్ బాస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఎప్పటినుంచో యష్ .. మలయాళం స్టార్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే.
Nara Rohith: బాలా మామకు సపోర్ట్ గా రంగంలోకి దిగిన అల్లుడు..
Also Read
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుందంట. కథ నచ్చడంతో యష్ ఈ సినిమాను ఓకే చేశాడట. డిసెంబర్ 23 న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలుకాబోతుందని చెప్పుకొస్తున్నారు. ఏడాది నుంచి రాఖీ భాయ్ కోసం అభిమానులు కన్నులు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు.. అని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ, ఖచ్చితమైన డేట్ ను చెప్పలేకపోయారు. అయితే ఈసారి డేట్ కూడా ఉండడంతో ఈసారి మొదలుపెడతాడు అని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో యష్ బాస్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడా..? లేదా ..? అనేది చూడాలి.
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!