Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi’s Smile Goes Viral: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఏషియన్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సత్కరించిన కార్యక్రమంలో వైభవ్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మోడీ 15 నుంచి 17 ఏళ్ల వయసున్న యువ క్రీడాకారులు దేశానికి పతకాలు సాధిస్తూ గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో కెమెరా వైభవ్ వైపు తిరగగా.. అతడి ముఖంపై చిరునవ్వు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రధాని మోడీ అభినందించారు. క్రికెట్, హాకీ, బాక్సింగ్ సహా వివిధ క్రీడల్లో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను కొనియాడారు. పోటీల్లో పలు రికార్డులు బద్దలవడం, క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలు నమోదు చేయడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. 15 నుంచి 17 ఏళ్ల వయసున్న పలువురు భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనలతో పతకాలు సాధించారని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్న వయసులోనే తమ ప్రతిభతో దేశ గౌరవాన్ని పెంచారని, కోట్లాది మంది భారతీయుల మనసులు గెలుచుకున్నారన్నారు.
Also Read
- IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
- Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
‘విజయం సాధించడానికి వయసు అడ్డంకి కాదు. చిన్న వయసులోనే ఆట ప్రారంభించడం అదనపు ప్రయోజనంగా మారుతుంది’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో కెమెరా వైభవ్ సూర్యవంశీపై దృష్టి సారించింది. మోడీ మాటలు వింటూ వైభవ్ చిరునవ్వు చిందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ప్రధాని తన ప్రసంగంలో వైభవ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. చిన్న వయసులోనే క్రీడా ప్రతిభను గుర్తించి, తగిన శిక్షణ అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధాని తెలిపారు. ఐదు నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఖేలో ఇండియా, ఎమర్జింగ్ ఖేలో ఇండియా కార్యక్రమాల ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
యువ క్రీడాకారులకు సరైన వేదిక, శిక్షణ అందితే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించగలరనే ఆశాభావాన్ని ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్ల ఎదుగుదల భారత క్రికెట్లో యువ ప్రతిభకు ఉన్న ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలను కూడా ప్రధాని ప్రత్యేకంగా కొనియాడారు. భారత్ సాధించిన మొత్తం 85 పతకాల్లో 38 పతకాలు మహిళా అథ్లెట్ల ఖాతాలో చేరాయని, వాటిలో 11 స్వర్ణ పతకాలు ఉన్నాయని తెలిపారు. మహిళా క్రీడాకారులు సాధించిన పతకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదని, అవి నూతన భారతదేశానికి ప్రతిరూపమని మోడీ వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లోనూ భారత మహిళలు తమ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!