Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance on Starlink in India: అమెరికా కుబేరుడు ఎలోన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్‌లింక్’ భారత్‌లోకి ప్రవేశించడంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో భారత టెలికాం మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో పోటీని ఆహ్వానిస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఇందులో స్టార్‌లింక్ కూడా భాగమేనని పేర్కొంది. అయితే, ఈ రంగంలోకి వచ్చే ప్రతి సంస్థ దేశీయ చట్టాలు, ప్రస్తుత నిబంధనలకు కట్టుబడి పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి ఇక్కడి కొందరు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ శక్తులు అడ్డుపడుతున్నాయంటూ మస్క్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ముకేశ్ అంబానీని ఉద్దేశిస్తూ భారత టెలికాం రంగంలో పోటీ తత్వంపై ప్రశ్నలు గుప్పించారు. మస్క్ ఆరోపణల నేపథ్యంలో రిలయన్స్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. “మేము ఎప్పుడూ పోటీకి భయపడలేదు. వినియోగదారులకు ఎవరు అత్యుత్తమ సేవలను అందిస్తున్నారో నిరూపించుకోవడానికి పోటీనే అతిపెద్ద పరీక్షగా మేము భావిస్తాం” అని తెలిపింది.
తన టెలికాం విభాగమైన ‘జియో ప్లాట్ఫార్మ్స్’ ప్రయాణాన్ని రిలయన్స్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. 2016లో జియో సేవలు ప్రారంభించినప్పుడు తమకు ఒక్క కస్టమర్ కూడా లేరని, కానీ కేవలం పదేళ్ల కాలంలో జియో వినియోగదారుల సంఖ్య 53 కోట్లకు పైగా పెరిగిందని వెల్లడించింది. భారతీయ పౌరులకు మెరుగైన డిజిటల్ సేవలతో పాటు ప్రపంచంలోనే అత్యంత చవకైన మొబైల్ డేటాను అందుబాటులోకి తీసుకురావడంలో జియో కీలక పాత్ర పోషించిందని కంపెనీ పేర్కొంది. స్టార్‌లింక్‌తో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలోకి వచ్చే అన్ని కంపెనీలను తాము ఆహ్వానిస్తున్నామని చెప్పిన రిలయన్స్.. జియోతో సహా ప్రతి ఒక్కరూ భారతీయుల ప్రయోజనాల కోసం, దేశ చట్టాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. భారత్‌లో స్వదేశీ, విదేశీ పెట్టుబడులకు, కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ స్వాగతం ఉంటుందని, అయితే ఇదంతా చట్ట పరిధిలోనే జరగాలని వివరించింది.
Also Read
- IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
- Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ భారీ చర్యలు.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్, చార్టర్డ్ విమానాలు స్వాధీనం
- Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
- Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
మరోవైపు, శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి కంపెనీకి ఒకే రకమైన నిబంధనలు, ప్రక్రియలు వర్తిస్తాయని భారత ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. తమ సొంత శాటిలైట్ నెట్వర్క్ సేవలకు సంబంధించి జియో కూడా ప్రస్తుతం ప్రభుత్వ అనుమతుల కోసమే వేచి చూస్తోందని రిలయన్స్ ఈ సందర్భంగా వెల్లడించింది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్న వేళ రిలయన్స్ చేసిన ఈ ప్రకటన టెలికాం వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో ఏ ఒక్కరి గుత్తాధిపత్యానికి తావులేదని ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..