‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషనల్ ఈవెంట్లలో తలమునకలైపోయారు ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ టీం. ఇప్పటి వరకు కన్నడతో ఇతర భాషల్లో సినిమాను ప్రమోట్ చేసిన యష్ ఇప్పుడు తెలుగుపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ముందుగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకుని, ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విలేఖరుల ప్రశ్నలకు యష్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.
Read Also : KGF 2 : బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా ? యష్ ఏమన్నాడంటే?
యష్ తొలి తెలుగు స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు ? అంటూ ఓ విలేఖరి ప్రశ్నించగా, ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ కూడా తెలుగు సినిమానే అని, ఈ సినిమా కోసం తెలుగు టెక్నీషియన్లు కూడా పని చేశారని, తాను , ప్రశాం నీల్ కూడా తెలుగు చక్కగా మాట్లాడగలమని, అలాగే ప్రశాంత్ తెలుగు సినిమాలు కూడా చేస్తున్నారని గుర్తు చేశారు. అంతేకాదు తెలుగు సినిమా కూడా చేద్దామని అన్నారు. మరి యష్ తెలుగు సినిమా ఎప్పుడు చేయబోతున్నాడో చూడాలి. ఎందుకంటే టాలీవుడ్ లోనూ యష్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికైతే అందరి దృష్టి ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ పైనే ఉంది. ఏప్రిల్ 13న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.