‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషనల్ ఈవెంట్లలో తలమునకలైపోయారు ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ టీం. ఇప్పటి వరకు కన్నడతో ఇతర భాషల్లో సినిమాను ప్రమోట్ చేసిన యష్ ఇప్పుడు తెలుగుపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ముందుగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకుని, ప్రెస్ మీట్ ను ఏర్పాటు…