Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరు తెలియని సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయనకున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన స్టైల్, స్వాగ్ తో అభిమానులను పిచ్చెక్కిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ చేస్తాడు. ప్రస్తుతం ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క రాజకీయాలు అంటూ తిరుగుతున్న పవన్.. ఇప్పటికీ అదే స్టైల్ ను మెయింటైన్ చేస్తున్నాడు. రాజకీయాల్లో వైట్ అండ్ వైట్ తో కనిపించినా.. సినిమాలోకి వచ్చేసరికి ఆయన లుక్ వేరే లెవెల్ కు మారిపోతోంది. తాజాగా పవన్ స్టైలిష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ బ్రో సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
Madhavi Latha: బిగ్ బాస్ కు మాధవీలతా.. ?
సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్ననే ఈ సినిమాలోని మొదటి సింగల్ ను రిలీజ్ చేశారు. మై డియర్ మార్కండేయ అంటూ సాగిన ఈ సాంగ్ లో పవన్ లుక్ చాలా స్టైలిష్ గా కనిపించింది. ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటించిన విషయం తెల్సిందే. తాజాగా ఊర్వశీ, పవన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో పవన్ లుక్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది అని చెప్పాలి. గ్రే కలర్ టీ షర్ట్ లో పవన్ క్లాస్ లుక్ లో అదరగొట్టాడు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. అబ్బా.. ఏమున్నాడురా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా పవన్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.