లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఏకంగా తన వలలో పడ్డ వారికి అంతా కలిపి 200 200 కోట్ల కుచ్చు టోపీ పెట్టిందట. తాజాగా హైదరాబాద్ లో పోలీసులు శిల్ప అనే వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి కోట్లకు కోట్లు వసూలు చేసిందట. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ దగ్గర్నుంచి డబ్బులను తీసుకొని మోసం తీసుకొని, అందరికీ నామాలు పెట్టేసింది. అయితే ఈ లిస్ట్ లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్లు సమాచారం. సాధారణ వ్యక్తులు అంటే ఏమో కానీ హీరోలు కూడా ఆమె చేతుల్లో మోస పోవడం గమనార్హం.
Read Also : మావా ఐటమ్ సాంగ్ ?… “ఆర్ఆర్ఆర్” హిలేరియస్ రిప్లై
ప్రముఖుల పేర్లు చెప్పి డబ్బులను తీసుకుంటున్న శిల్ప ఫేజ్ త్రీ పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించింది. ఆ తరువాత ప్లాన్ ప్రకారం సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, లాయర్లు తదితరులను బుట్టలో వేసుకుని 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కుచ్చు టోపీ పెట్టింది. అయితే విషయం గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చాలామంది ప్రముఖులు తాము మోసపోయామని పోలీస్ స్టేషన్ లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.