మావా ఐటమ్ సాంగ్ ?… “ఆర్ఆర్ఆర్” టీం హిలేరియస్ రిప్లై

“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో దూకుడు పెంచేస్తోంది. నిన్న ఈ సినిమా నుంచి “సోల్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ ‘జనని’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీంకు నెటిజన్ కు మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ అందరి సృష్టిని ఆకర్షిస్తోంది. అందరూ సోషల్ మీడియా ద్వారా ‘జననీ’ సాంగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే ఓ నెటిజన్ మాత్రం వెరైటీగా స్పందించాడు.

Read Also : టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత

“ఐటమ్ సాంగ్ ఉందా మావా ?” అంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీంను ట్యాగ్ చేశాడు. దానికి బ్రహ్మానందం ఫోటోను యాడ్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ కూడా అంతే కూల్ గా ‘ఏ నువ్వు చేస్తావా ?” అంటూ ప్రశ్నించారు. వీళ్ళు కూడా దానికి బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్ప్రెషన్ ను జోడించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నెటిజన్, ‘ఆర్ఆర్ఆర్’ టీం మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మావా ఐటమ్ సాంగ్ ?… "ఆర్ఆర్ఆర్" టీం హిలేరియస్ రిప్లై

Related Articles

Latest Articles