Trivikram Srinivas : అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు భారీ హిట్ కొట్టాయి. హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబోలో మరో భారీ సినిమా వస్తుందని పుష్ప-2 రిలీజ్ కు ముందే ప్రకటించారు. పుష్ప-2 పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా మరింత భారీగా తీస్తామని ఏవేవో కామెంట్లు చేశారు మూవీ టీమ్. భారీ మైథలాజికల్ సినిమా అన్నారు. కానీ చివరకు భారీ ట్విస్ట్. అట్లీతో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఎల్లుండి అనౌన్స్ మెంట్ ఉంది. త్రివిక్రమ్ తో చేసే సినిమాకు చాలా ఖర్చుతో పాటు చాలా టైమ్ పడుతుందని.. అందుకే అట్లీతో బన్నీ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.
Read Also : Ananya Nagalla : చీరలో చించేసిన అనన్య నాగళ్ల.. ఆ అందాలు చూశారా..
అయితే బన్నీ కోసమే ఇన్నేళ్లు త్రివిక్రమ్ వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు బన్నీ చేజారిపోవడంతో గురూజీ ప్లాన్ బీ రెడీ చేస్తాడా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్-అట్లీ సినిమా భారీ పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. ఎంత లేదన్నా రెండు లేదా మూడేళ్లు టైమ్ పట్టేలా ఉంది. అన్నేళ్లు త్రివిక్రమ్ వెయిట్ చేయలేడు కదా. అందుకే వేరే హీరోతో సినిమా చేస్తాడేమో అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ చేతిలో మూడు, నాలుగు సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఎన్టీఆర్ చేతిలో రెండు, ప్రభాస్ చేతిలో నాలుగు, రామ్ చరణ్ చేతిలో రెండు ఉన్నాయి. కాబట్టి విజయ్ దేవరకొండ లేదా నానితో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే వీరిద్దరిలో ఒకరికి కథ చెప్పే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి.