Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య నాగళ్ల ఇప్పుడు వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటోంది. తెలుగు అమ్మాయిల్లో ఆమెకే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ట్యాలెంట్ తో పాటు స్టార్ హీరోయిన్లకు ఉండే అందం ఆమె సొంతం. కానీ స్టార్ ఇమేజ్ రావట్లేదు. అడపా దడపా సినిమా అవకాశాలు మాత్రం వస్తున్నాయి. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. మల్లేశం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ మంచి హిట్ కొట్టడంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. దాని తర్వాత పవన్ కల్యాణ్ తో చేసిన వకీల్ సాబ్ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచే ఆమెకు ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.
Read Also : Vaishnavi Chaithanya : అలా మర్చిపోతే ఎలా బేబీ.. స్టేజిపైనే పరువు పాయే..
ఆ తర్వాత వరుసగా వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటిస్తోంది. తంత్ర, పొట్టేల్, బహిష్కరణ, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లాంటి డిఫరెంట్ వెబ్ సిరీస్ లలో నటించింది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి చీరలో రెచ్చిపోయింది. ఇందులో తన నడుము అందాలతో పాటు తనదైన పరువాలను వయ్యారంగా ఆరబోసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా అనన్య నాగళ్లకు లైకులు, కామెంట్లు కురిపించేస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.