బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే తనయ అనన్య పాండే కెరీర్ చాలా సప్పగా సాగిపోతుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పతి పత్ని ఔర్ ఓతో సెకండ్ హిట్ చూసింది. హ్యాట్రిక్ హిట్టుకు బ్రేకులేసింది లైగర్. విజయ్ దేవరకొండ ముందు తేలిపోయిన ఈ సన్న జాజి తీగ టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది మేడమ్. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది.
అనన్య నటించిన సినిమాలు థియేటరల్లో కన్నా ఓటీటీలో ఎక్కువ ప్రత్యక్షమయ్యాయి. దీంతో పెద్దగా పేరు, క్రెడిట్ దక్కలేదు మేడమ్‌కు. కాలీ పీలీ, గెహ్రాయ్ యా, కో గయే హమ్ కహా, సీటీఆర్‌ఎల్ చిత్రాలు ఓటీటీకి వచ్చాయి. 2023లో రిలీజైన డ్రీమ్ గర్ల్ 2లో చివరి సారిగా ఫుల్ తెంత్ రోల్‌లో సిల్వర్ స్క్రిన్ పై కనిపించింది. లాస్ట్ ఇయర్ వచ్చిన బ్యాడ్ న్యూజ్ లో క్యామియో అప్పీరియన్స్ ఇచ్చింది అమ్మడు. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత కేసరి చాప్టర్ 2లో కనిపించబోతుంది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి రాబోతుంది మూవీ. ఇందులో లాయర్ రోల్ చేస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రజెంట్ మేడమ్ చేతిలో కేసరి2 తో పాటు యంగ్ హీరో లక్ష్య్ లఖ్వానీతో చాంద్ మేరీ దిల్‌లో నటిస్తోంది. ఇవి అఫీషియల్ కన్ఫర్మ్ కాగా, మరికొన్ని ప్రాజెక్టుల కోసం అనన్య పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్. గల్లీబాయ్ సీక్వెల్‌లో రణబీర్, ఆలియా ప్లేసుల్లోకి విక్కీ కౌశల్, లైగర్ బ్యూటీని తీసుకురావాలని అనుకుంటున్నట్లు టాక్. అలాగే కార్తీక్ ఆర్యన్ అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకటైన తు మేరీ మై తేరా మై తేరా తు మేరీలో కూడా ఈ భామనే తీసుకోవాలన్న బజ్ నడుస్తోంది. గత సినిమాలతో పడిపోయిన గ్రాఫ్ కేసరి2తో అనన్య పెంచుకుంటుందేమో చూడాలి.