తమిళ హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం చాలా అరుదు. కానీ సిద్దార్థ్ మాత్రం తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నువ్వొస్తానంటే నొనేద్దంటానా, బొమ్మరిల్లుతో పక్కింటి అబ్బాయిగా మారిన ఈ చెన్నై కుర్రాడు.. ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయడంలో తడబడ్డాడు. ఓయ్‌ను ఇప్పుడు కల్ట్ క్లాసిక్ మూవీ అని స్కైకి ఎత్తుతున్నారు కానీ అప్పట్లో ఓ ప్లాప్ మూవీ. తెలుగులో కెరీర్ బెడిసి కొట్టడంతో ఓన్ ఇండస్ట్రీలోకి బ్యాగ్ సర్దేసుకున్నాడు సిద్దు.
Also Read : Coolie : ‘కూలీ’ హిందీ టైటిల్ వివాదం సద్దుమణిగింది
కోలీవుడ్‌లో కూసింత పాపులర్ అయ్యాక నిర్మాతగా మారి పలు చిత్రాలు నిర్మించాడు. తమిళ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న టైంలో మళ్లీ మనసు టాలీవుడ్ పైకి లాగేసింది. దీంతో నెగిటివ్ రోల్, సెకండ్ హీరో రోల్ అని చూడకుండా మహా సముద్రంతో రీ ఎంట్రీ ఇస్తే అది ప్లాప్. ఇక టాలీవుడ్ కలిసి రావడం లేదని ఫుల్ ఫ్లెడ్జ్‌గా తమిళంపైనే కాన్సట్రేషన్ చేసి చిన్నాసినిమాతో హిట్ కొట్టాడు. కానీ ఇండియన్ 2, మిస్ యు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక ఇప్పుడు 3బీహెచ్కేతో రాబోతున్నాడు. శరత్ కుమార్, దేవయాని, గుడ్ నైట్ ఫేం మీథా రఘునాద్ కీ రోల్స్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ‘సేనాపతి’ ఒరిజినల్ వర్సన్ ‘8 తూటక్కల్’ ఫేం శ్రీ గణేష్ 3BHK దర్శకుడు. అందుకే సినిమాపై కాస్త అంచనాలున్నాయి. ఓ మధ్య తరగతి కుటుంబం.. సొంత ఇంటి కలను నేరవేర్చుకుందా లేదా అనే కాన్సెప్టుతో 3BHK తెరకెక్కుతోంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో జులై 4న నితిన్ తమ్ముడుకు పోటీగా రాబోతోంది. రీసెంట్లీ తమిళంలో కుడుంబస్తాన్, టూరిస్ట్ కుటుంబ కథా చిత్రాలు హిట్ అవడంతో 3BHK పై హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు సిద్దు.