సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ కీ రోల్స్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తుంది.
Also Read : Chennai Drugs Case : డ్రగ్స్ కేసులో పంజా సినిమా దర్శకుడి తమ్ముడుకి రిమాండ్
కాగా ఈ సినిమా హిందీ టైటిల్ పై కొద్దీ రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ సినిమాకు హిందీ వర్షన్ కు మజాదుర్ అనే టైటిల్ ను ప్రకటించారు. ఈ టైటిల్ పై వివాదం నెలకొంది. రజనీ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. హిందీలో కూడా అదే టైటిల్ ను పెడితే బాగుండు అనే కామెంట్స్ వినిపించాయి. కానీ అమితాబ్ బచ్చన్ హీరోగా 1983 లో కూలీ అనే సినిమా వచ్చింది. మళ్ళి అదే టైటిల్ తో 2020 లో వరుణ్ ధావన్ హీరోగా కూలీ నం.1 అనే సినిమా వచ్చింది. ఇప్పుడు అదే టైటిల్ పెట్టేందుకు కుదరకపోవడంతో మజాదుర్ అనే టైటిల్ ను పెట్టారు. అనేక విమర్శలు రావడంతో ఆలోచనలో పడిన మేకర్స్ ‘కూలీ’ ది పవర్ హౌస్ అనే ట్యాగ్ లైన్ వచ్చేలా టైటిల్ ను మార్చారు మేకర్స్. మొత్తానికి అనేక తర్జన భర్జనల అనంతరం కూలీ వివాదం అలా ముగిసింది.