Mirai : బలమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ప్రస్తుతం అతను నటిస్తున్న మూవీ మిరాయ్. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటిఏ వచ్చిన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. పురాణాలను బేస్ చేసుకుని సోషియో ఫాంటసీగా ఈ మూవీని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దైవ రహస్యాన్ని చేధించేందుకు ప్రయత్నించే విలన్లను తేజసజ్జా ఎలా అడ్డుకున్నాడో ఈ సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం. అయితే ట్రైలర్ చివర్లో రాముడి గెటప్ కనిపించింది. ఆ రాముడి గెటప్ వేసింది మాత్రం కచ్చితంగా స్టార్ హీరోనే కావచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంకొందరు మాత్రం మహేశ్ బాబు ఆ పాత్ర చేశాడేమో అంటున్నారు.
Read Also : Nani : జున్ను కాలు ఫ్రాక్చర్ అయింది.. నాని ఎమోషనల్
తాజాగా జరిగిన ఈవెంట్ లో తేజను ఇదే విషయం అడగ్గా.. ఆ పాత్ర చేసింది మహేశ్ బాబు కాదని చెప్పాడు. కానీ ఎవరు పోషించారనేది మాత్రం సీక్రెట్ గానే ఉంచాడు తేజ. చూస్తుంటే ఈ సినిమాలో చాలా పాత్రలు లీనమైనట్టు తెలుస్తోంది. పురాణాలను బేస్ చేసుకున్నారు కాబట్టి.. ఇందులో కొందరు దేవుళ్లు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు తేజ. ఇక సెప్టెంబర్ 5న మూవీ రిలీజ్ అయితే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ప్రస్తుతానికి ప్రమోషన్లు స్పీడ్ గా చేస్తున్నారు. ఆ రోజున చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భారీ పోటీ ఉన్నా సరే తన మూవీని బలంగా ప్రమోట్ చేసుకుంటున్నాడు తేజ. మరి పోటీని తట్టుకుని నిలబడితే మాత్రం తేజ క్రేజ్ మరింత పెరుగుతుంది.
Read Also : OG : ఓజీ స్టోరీ ఇదేనట.. కథలో ఇంత డెప్త్ ఉందా..