Vishu – Manoj : మంచు ఫ్యామిలీ రగడ ఏ స్థాయికి చేరుకుందో మొన్నటి దాకా చూశాం. విష్ణు వర్సెస్ మనోజ్ అన్నట్టు సాగిన ఈ రచ్చ.. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వివాదం కాస్తా కన్నప్ప వర్సెస్ భైరవం అనే దాకా వెళ్లింది. కన్నప్పపై మంచు మనోజ్ ట్రోలింగ్ చేస్తూ కామెంట్లు కూడా చేశాడు. కానీ ఏమైందో తెలియదు.. సడెన్ గా ఇద్దరూ తగ్గి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. మనోజ్, విష్ణు ఇద్దరూ ఇంటర్వ్యూల్లో కలిసి పోవడానికి రెడీగా ఉన్నామంటూ చెబుతున్నారు.
Read Also : స్టాక్ మార్కెట్లో అత్యంత ఖరీదైన షేర్లు కలిగిన టాప్- 10 దేశాలు..
మొన్న మనోజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ కుటుంబం మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఆ శివుడి ఆజ్ఞ ద్వారా అది జరగాలని కోరుకుంటున్నా. నాకు ఎవరిపై శత్రుత్వం లేదు. నేను కన్నప్ప గురించి చేసిన కామెంట్లకు క్షమాపణ చెబుతున్నా. అందరం కలిసిపోతే అదే హ్యాపీ అంటూ చెప్పాడు.
మనోజ్ ఈ కామెంట్లు చేసిన రెండు రోజులకే విష్ణు కూడా తమ్మారెడ్డి భరద్వాజతో చేసిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. మీ కుటుంబం మళ్లీ కలిసిపోవాలి అంటూ భరద్వాజ చెప్పగా.. విష్ణు కూడా సానుకూలంగానే స్పందించాడు. మీ సూచనలు తప్పకుండా పాటిస్తానని.. అదే జరగాలని కోరుకుంటున్నట్టు వివరించాడు. వీరిద్దరూ చేసిన కామెంట్లను బట్టి చూస్తుంటే మంచు ఫ్యామిలీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయేమో అనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. మరి ఇద్దరూ కలిసిపోతారా లేదా అన్నది చూడాలి.
Read Also : Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు..