సౌత్ దర్శకులపై నార్త్ హీరోస్ మనసు పారేసుకుంటున్నారు. ఇక్కడ స్టోరీలకు, ఇక్కడ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ కు ఆడియన్స్ ఫిదా కావడంతో సౌత్ దర్శకులకు ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇప్పుడు మరో టీటౌన్ స్టార్ ఫిల్మ్ మేకర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతడే గోపీచంద్ మలినేని. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి. ఈ సామెత బాలీవుడ్- టాలీవుడ్ కు సరిగ్గా సరిపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమను చిన్న చూపుగా చూసిన బీటౌన్ కు గట్టిగా బుద్ధి చెప్పిన టీటౌన్ ఇప్పుడు కాలరెగరేసే సినిమాలు చేస్తుంది. ఈ చిత్రాలకు నార్త్ బెల్ట్ బ్రహ్మారథం పట్టడంతో ఇక్కడి కథలపై ఫోకస్ చేస్తుంది. అలాగే ఇక్కడ డైరెక్టర్లను లైన్లో పెడుతుంది సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి, వివి వినాయక్ ఇప్పుడు గోపిచంద్ మలినేని టైం.
Also Read : SSRMB : మహేశ్ – రాజమౌళి సైలెంట్ గా మొదలుపెట్టారు..?
వీర సింహారెడ్డి గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు గోపిచంద్. బీటౌన్ సీనియర్ అండ్ యాక్షన్ హీరో సన్నీడియోల్ తో జాట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు ఈ సీనియర్ హీరో. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షయామీ ఖేర్, రెజీనా కసండ్రా హీరోయిన్స్. జాట్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమాను ఏప్రిల్ 10న హిందీ, తెలుగు, తమిళంలో రిలీజ్ చేయనున్నట్లు థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించాడు గోపిచంద్ మలినేని. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న జాట్ కు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జాట్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సన్నీడియోల్ కు, బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న గోపిచంద్ మలినేని హిట్టు ఇస్తాడో లేదో చూడాలి.