Nani: ఒక సినిమా హిట్ అవ్వాలంటే.. సినిమా తీయడం ముఖ్యం కాదు.. దాన్ని ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లాలి. ప్రమోషన్స్ లో పీక్స్ చూపించాలి. ఎక్కడ చూసిన.. ఆ సినిమా పేరే వినిపించాలి. అప్పుడే ఆ సినిమాపై ఆడియెన్స్ కు ఒక ఇంప్రెషన్ వస్తుంది. సినిమా అంటే.. హీరో, హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇక ప్రమోషన్స్ లో సైతం వీరే ఎక్కువ కనిపిస్తారు. సరే వీరందరూ రాకపోయినా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ కనిపిస్తారు. కొత్త, పాత అని పక్కన పెడితే.. సినిమా కోసం వారు ఎంత కష్టపడ్డారో చెప్పడం వలన సినిమా ఏ రేంజ్ లో వచ్చిందో ప్రేక్షకులు తెలుసుకుంటారు. సరే.. ఇదంతా మాకు తెలుసు కానీ, ఇప్పుడెందుకు చెప్తున్నారు అనేగా డౌట్.. అక్కడికే వస్తున్నాం.. న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మార్చి 30 న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నే అందుకున్నాయి.
SSMB29: ఎక్కించండి.. ఎక్కించండి.. ఇంకా హైప్ ఎక్కించండి
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఈ ప్రమోషన్స్ మొత్తంలో న్యాచురల్ స్టార్ మాత్రమే కనిపించడం. సినిమాలో వన్ మ్యాన్ షో అని అంటాం.. ఇక్కడ ప్రమోషన్స్ లో సైతం మనోడు వన్ మ్యాన్ షో చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా నాని ఒక్కడే వెళ్తున్నాడు.. నాని ఒక్కడే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.. నాని ఒక్కడే తిరుగుతున్నాడు.. ఎక్కడ చూసినా నాని.. నాని.. నాని.. దీంతో అభిమానులు సైతం అన్నా.. సినిమాలో నువ్వొక్కడివే ఉన్నావా..? ఏంటి అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సినిమా మొత్తం కొత్తవారు.. నాని ఒక్కడే తెలుసు అనుకోవడానికి కూడా రాలేదు. హీరోయిన్ కీర్తి సురేష్.. నేషనల్ అవార్డు అందుకున్న హీరోయిన్.. ఆమెకు ఫుల్ పబ్లిసిటీ ఉంది.డైరెక్టర్ కొత్తవాడు.. కానీ, ఇండస్ట్రీ అలవాటు అవ్వాలి అంటే ఇలాంటి ప్రమోషన్స్ లో పాల్గొనడం అతనికి అవసరం. మరి వీరెందుకు ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. అందరిని తొలుస్తున్న ప్రశ్న. నాని ఒక్కడే ఈ బరువు మొత్తం భుజాన వేసుకోవడానికి కారణం ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది. ఇంకా సినిమా రిలీజ్ కు పది రోజులు ఉంది. ఈ పది రోజుల్లో వారు కూడా కలుస్తారా..? లేదా అనేది చూడాలి.