BiggBoss Telugu 6: రోజురోజుకు బిగ్ బాస్ హౌస్ లో వివాదాలు ఎక్కువైపోతున్నాయి, టాస్కులు, నామినేషన్స్ పక్కకు పెడితే పర్సనల్ గ్రడ్జ్ ఎక్కువగా కనిపిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక హౌస్ లో ఎవరికి వారు గ్రూప్ లుగా గేమ్ ఆడుతూ కొంతమందిని సింగిల్ గా చేసి ఆడుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన టాస్క్ లో కార్తీక దీపం హీరోయిన్ కీర్తి భట్ ను ఒంటిరిని చేసి ఆడుకున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎంత ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఎవరు ఎంతసేపు టీవీలో కనిపిస్తున్నారు అనేది రేటింగ్ ద్వారా చెప్పాల్సి ఉంటుందని, 10 నిమిషాల కంటే తక్కువ ఉన్నవారు ఎవరు.. ఎక్కువ ఉనన్వారు ఎవరు అనేది రేటింగ్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇందులో కూడా గొడవ దిగారు గీతూ, రేవంత్.
తాను అందరికంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటానని, ఎక్కువ ఎంటర్ టైన్ చేస్తాను కాబట్టి 10 నిమిషాలు తనను చూపిస్తారని గీతూ చెప్పుకురాగా.. రేవంత్ సైతం ఎక్కువ నామినేషన్స్ లో తానే ఉన్నానని, తనకు ఎక్కువగా చూపించే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఇక 0.3 కన్నా తక్కువ ఉన్నవారికి జీరో రేటింగ్ ఇవ్వాలని చెప్పగా.. ఆరోహి, కళ్యాణ్, కీర్తి భట్ కు జీరో రేటింగ్ ఇచ్చారు. ఇక వారిలో ఒకరిని జైల్లో ఉంచాలని చెప్పడంతో అందరు ఏక నిర్ణయంతో కీర్తిని జైల్లో పెట్టడానికి అంగీకరించారు. దీంతో కీర్తి భట్ జైల్లోకి వెళ్ళింది. అక్కడ ఆమె ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.