Rules to Follow while watching Adipurush in theatres: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తానాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తూ ఉండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్. ఆంజనేయ స్వామి పాత్రలో దేవదత్త నాగే నటిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ బాషల్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Also Read: Raviteja remuneration: హిట్లతో పనేంటి.. ‘తగ్గేదే’ లేదంటూ మళ్లీ పెంచేసిన రవితేజ!
ఇప్పటికే ఈ సినిమా ధియేటర్లలో ఒక సీటు హనుమంతుడి కోసం కేటాయిస్తున్నామంటూ సినిమా దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించడంతో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. కొంతమంది ఇది ఒక ప్రమోషనల్ స్టంట్ అని కొట్టే పారేస్తుంటే మరి కొంత మంది శ్రీరాముడి కథ చెప్పేటప్పుడు హనుమంతుడు కోసం ఒక సీటు వదిలితే తప్పేంటి? వారి విశ్వాసాన్ని మనం ఎందుకు తప్పు పట్టాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద అనేక రకాల చర్చలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒక వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆది పురుష్ సినిమా చూసేటప్పుడు పాటించాల్సిన నియమాలు అంటూ కొన్ని పాయింట్లు వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేస్తున్నారు.
Also Read: Mrunal Thakur: బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘సీత’.. ఈసారి దేవరకొండతో!
ఆదిపురుష్ చిత్రం చూసేప్పుడు పాటించాల్సిన నియమాలు
-మద్యం తాగి థియేటర్ కి వెళ్ళకూడదు -మాంసాహారం తిని థియేటర్ కి వెళ్ళకూడదు
-చెప్పులు వేసుకొని థియేటర్ కి వెళ్ళకూడదు
-థియేటర్ వెలుపల లోపల జై శ్రీరామ్ తప్ప నటుడి పేరు కానీ చిత్రంలో ఇతర పాత్రలకి జేజేలు కొట్టకూడదు
-కుదిరితే టీ షర్ట్ జీన్స్ లాంటివి వేసుకోకుండా అర్ధ నగ్నంగా పైన తెల్లటి లేదా కాషాయపు బట్టతో కప్పుకొని కింద పంచ కట్టుకొని వెళ్ళాలి
-కుదిరితే చిత్రం ప్రదర్శించే స్క్రీన్ ముందు ఇబ్బంది కలగకుండా అందరూ కొబ్బరి కాయలు కొట్టండి
– హనుమంతుడికి కేటాయించిన కుర్చీని పూలమాలలతో, ధూప, దీప నైవేద్యాలతో అలంకరించండి.
– జై శ్రీ రామ్ ఈ నామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి.. జై శ్రీ రామ్
అని ఉన్న మెసెజ్లు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కింద తెలియచేయండి.
WhatsApp Forward
Please Follow pic.twitter.com/ZKrMIltHWz— Actual India (@ActualIndia) June 13, 2023