What is Jithender Reddy Movie About: ‘ఉయ్యాల జంపాల’, మజ్ను లాంటి లవ్‌స్టోరీలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన వవిరించి వర్మ రూట్ మార్చి డిఫరెంట్ జానర్ కథతో ‘జితేందర్ రెడ్డి’ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేయగా అందులో ఒక నాయకుడు చిన్న పాపను పక్కను కూర్చోబెట్టుకుని ప్రజల కష్టాలు వింటున్నట్లు చూపించారు. అయితే ఆ నాయకుడు ఎవరు అనేది అంటే ఆయన ఫేస్ రివీల్ చేయలేదు, పాత్రధారి పేరు కూడా వెల్లడించలేదు. అయితే పోస్టర్ ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది. సినిమా టైటిల్‌ను బట్టి, పోస్టర్‌లో ఉన్న నేపథ్యాన్ని నిశితంగా గమనిస్తే తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ సంఘటన నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఉన్నట్లు చెబుతున్నారు. స్టర్ చూశాక.. ప్రేమకథలతో ఫేమస్ అయిన విరించి వర్మ ఈ తరహా కథ ఎందుకు ఎంచుకున్నారు? ఈ సినిమాతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న క్యూరియాసిటీ జనాల్లో కలిగింది.
Genelia: మళ్లీ తల్లి కానున్న జెనీలియా అంటూ వార్తలు.. అసలు విషయం ఇదేనట!
ప్రస్తుతం బీజేపీలో జితేందర్ రెడ్డి పేరుతో ఓ నాయకుడు ఉండగా ఆయన మహబూబ్ నగర్ మాజీ ఎంపీగా కూడా పని చేశారు. అయితే ఇది ఆయన కథ కాదు అని చెబుతున్నారు. అయితే ఈ ‘జితేందర్ రెడ్డి’ ఎవరు? ఆయన కథ ఏమిటి? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది. అసలు విరించి వర్మ పొలిటికల్ బేస్డ్ స్టోరీ ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఈ సినిమాతో ఏం చెప్పాలని అనుకుంటున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాకి పని చేసే టెక్నీషియన్లు మాత్రం మంచి ఫేమ్ ఉన్న వారే కనిపిస్తున్నారు. వి.ఎస్ జ్ఞాన శేఖర్ కెమెరామెన్ పని చేస్తున్న ఈ సినిమాకి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ నిర్మిస్తున్నారు.