Devara: మళ్లీ నెగటివ్ ట్రెండ్… ఈసారి డైరెక్ట్ గా ఎన్టీఆర్ రంగంలోకి దిగాలేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్… సోషల్ మీడియాని కబ్జా చేసి దేవర సినిమా టీజర్ అప్డేట్ కావాలి అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తున్నారు. దీంతో #Devara #WeWantDevaraUpdate ట్యాగ్స్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ ని ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ ఫాన్స్ అప్డేట్ కావాలన్నప్పుడల్లా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ అప్డేట్ ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఇటీవలే డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఒక హ్యూజ్ అప్డేట్ తో త్వరలో బయటకి రాబోతున్నాం అని చెప్పాడు.
ఆ త్వరలో ఎప్పుడు అనేదే ఇప్పుడు నందమూరి అభిమానుల ప్రశ్న. డిసెంబర్ 25న వస్తారా? జనవరి 1న వస్తారా లేక న్యూ ఇయర్ కి వస్తారా? టీజర్ కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు డేట్ చెప్పండి అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇలానే గతంలో ఒకసారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తే స్వయంగా ఎన్టీఆర్… అమిగోస్ స్టేజ్ పైన “ఊరికే అప్డేట్ అప్డేట్ అని అడగకండి. అప్డేట్ నిజంగానే ఉంటే మా ఇంట్లో వాళ్ల కన్నా ముందు మీకే చెప్తాము, అప్పటివరకు వెయిట్ చెయ్యండి” అని చెప్పాడు. అప్పటినుంచి ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు మళ్లీ అప్డేట్ కావాలి అంటున్నారు. మరి అభిమానులకి ఎన్టీఆర్ నుంచి మెసేజ్ వస్తుందా లేక మేకర్స్ నుంచి అప్డేట్ వస్తుందా కొరటాల బయటకి వచ్చి అప్డేట్ రివీల్ చేస్తాడా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!