Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh Director Vishal Chaturvedi: నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా.. రూ.452.86 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇంతటి విజయాన్ని అందుకున్నప్పటికీ బాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాలేదని దర్శకుడు విశాల్ చతుర్వేది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఎవరూ తనను పట్టించుకోలేదన్నారు. చిన్న సినిమా, కొత్త దర్శకుడి ప్రయత్నం కావడంతోనే బడా నిర్మాణ సంస్థలు ఈ విజయాన్ని గుర్తించలేదని అభిప్రాయపడ్డారు.
‘పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటనలు విడుదల చేయడం నేను చూశా. కానీ నా సినిమా విషయంలో మాత్రం ఒక్క పెద్ద నిర్మాణ సంస్థ కూడా స్పందించలేదు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు చాలామంది హనుమాన్ అంశ్ గురించి ప్రశంసిస్తున్నప్పటికీ.. బహిరంగంగా అభినందించిన వారు కొద్దిమందే. అందులో వరుణ్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ఉన్నారు. నా సినిమా విజయంపై ఏ ప్రముఖ స్టూడియో లేదా నిర్మాణ సంస్థ లేఖ రాయలేదు. అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు’ అని విశాల్ చతుర్వేది అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read
- Samantha: సమంత, రాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..
- Shiva Kandukuri Marriage: టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి.. పెళ్లిపీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో!
- Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
- Ramayana Part 2: రణ్బీర్, యష్ కాదు.. పార్ట్ 2లో ప్రధాన ఆకర్షణ ఆయనే.. ఆసక్తికర విషయాలు చెప్పిన అజింక్య!
సినిమా సక్సెస్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో లేదా పెద్ద నిర్మాణ సంస్థ తప్పనిసరి అనే అపోహను హనుమాన్ అంశ్ తొలగించిందని దర్శకుడు విశాల్ చతుర్వేది అనాన్రు. సినిమా అనేది ప్రజలకు సంబంధించిన మాధ్యమమని, ప్రేక్షకులే సినిమా బాగుందో లేదో నిర్ణయిస్తారన్నారు. గతంలో విమర్శకులు, సోషల్ మీడియా అభిప్రాయాలే ప్రేక్షకులపై ప్రభావం చూపేవని.. ఇప్పుడు ప్రేక్షకులే తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతున్నారని చతుర్వేది పేర్కొన్నారు. రామాయణ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు సినిమాను చూడలేదు. ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల సమయం దొరకలేదు. సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
-
Samantha: సమంత, రాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..
-
Shiva Kandukuri Marriage: టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి.. పెళ్లిపీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో!
-
Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!