కోలీవుడ్‌లో పొంగల్‌ను మూడు రోజుల ముందే మొదలుపెడుతూ విజయ్, అజిత్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగ వాతావరణాన్ని ముందే తీసుకోని రావాల్సిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలు మాత్రం సినీ అభిమానులని కంగారు పెడుతున్నాయి. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని నిజం చేస్తూ తెలంగాణాలో, ఓవర్సీస్ లో రెండు సినిమాల ప్రీబుకింగ్స్ సూపర్బ్ గా జరుగుతున్నాయి. తెలంగాణాలో టికెట్ రేట్స్ విషయంలో, స్పెషల్ షోస్ విషయంలో కూడా పర్మిషన్స్ బయటకి రావడంతో సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది.
ఏపీలో మాత్రం సినారియో ఇలా లేదు. సినీ అభిమానులని, ట్రేడ్ వర్గాలని టెన్షన్ పెడుతూ వైజాగ్, ఒంగోల్, నెల్లూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. రెండు సినిమా బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోవడంతో చిరు, బాలయ్యల ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ నుంచి స్పెషల్ షో గురించి ఇంకా అప్డేట్ రాలేదు, టికెట్ రేట్స్ విషయంలో కూడా 25 రూపాయలే హైక్ ఇస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నా మరో రెండు రోజుల్లో వాల్తేరు వీరయ్య రిలీజ్ అవుతోంది, 24 గంటల్లో వీర సింహా రెడ్డి సినిమా రిలీజ్ అవుతోంది. ఇలాంటి సమయలో మాకు కారణాలు వద్దు టికెట్స్ కావాలి అంటూ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. టికెట్స్ వీలైనంత త్వరగా ఓపెన్ అవ్వకపోతే రెండు సినిమాల ఓపెనింగ్స్ కి భారి దెబ్బ పడే అవకాశం ఉంది.