VJ Sunny: విజె సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్. ఇతగాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిపోర్టర్ గా, విజె గా, సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగుపెట్టాడు. అక్కడ నిజాయితీగా ఆడి ప్రేక్షకుల మనసులతో పాటు బిగ్ బాస్ సీజన్ 5 కప్పును కూడా గెలుచుకున్నాడు. హౌస్ నుంచి బయటికి రాగానే సన్నీ ని అందరు ఆకాశానికెత్తేశారు. ఇక బయటికి రాగానే సినిమా అవకాశాలు క్యూ కడతాయని, ఆఫర్లే ఆఫర్లు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అదేమీ జరగలేదు. ఒకటి రెండు సినిమాలు క్లాప్ కొట్టి వదిలేశారు. ప్రస్తుతం సన్నీ తిరిగి సీరియల్స్ లో నటిస్తున్నాడు. రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సన్నీ బిగ్ బాస్ షో పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ షో వలన ఎవరికి ఏమి ఒరిగేది లేదని చెప్పి షాక్ ఇచ్చాడు.
“బిగ్ బాస్ వలన నాకు ఒరిగిందేమి లేదు. ఎక్కడికైనా వెళ్లి నేను బిగ్ బాస్ విన్నర్ అని చెప్తుంటే.. బిగ్ బాస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సాధారణ ప్రజలే కాదు.. ఒక దర్శకుడు కూడా సర్.. నేను బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ను అని పరిచయం చేసుకొంటే.. ఆ షో పేరే వినలేదే అని అన్నారు. దీంతో నేను బిగ్ బాస్ విన్నర్ ను అని చెప్పుకోవడం మానేశాను. తరువాత నా సినిమాలు, సీరియల్స్ చేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. సన్నీ అన్నాడు అనేది కాదు కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నెర్స్ గా గెలిచిన వారెవ్వరు షో అయ్యాక కనిపించింది లేదు. శివ బాలాజీ, కౌశల్, సన్నీ, రాహుల్ సిబ్లీగంజ్, అభిజిత్ .. ఏ ఒక్కరు బిగ్ బాస్ విజేత అయ్యాకా ఆ ఫేమ్ తో ఒక్క సినిమా కూడా తీసింది లేదు. మరి ఈ సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.