ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా విశ్వక్ సేన్ గురించే చర్చ జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్రాంక్ వీడియో చేసి వివాదం కొనితెచ్చుకున్న ఈ హీరో ఆ తరువాత ఒక డిబేట్ ఛానెల్ లో యాంకర్ ను అనరాని మాట అని మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఇక దీంతో విశ్వక్ పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. ఇక విశ్వక్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6 న రిలీజ్ కాబోతున్న విషయం విదితమే. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాల గురించి మాట్లాడిన హీరో తాజాగా ప్రెస్ మీట్ లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. విశ్వక్ సేన్ నటుడు తో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్న విషయం విదితమే.
‘ఫలక్ నామా దాస్’ చిత్రాన్ని విశ్వక్ స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించాడు. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని విశ్వక్ సేన్ ను మాస్ కా దాస్ ని చేసింది. ఇక తాజాగా ఈ హీరో బాలీవుడ్ లో కి అడుగుపెడుతున్నట్లు ప్రకటించాడు. అయితే హీరోగా కాదు డైరెక్టర్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపాడు. “మరో రెండేళ్లలో నేను బాలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగుపెట్టబోతున్నాను. మాస్ కా దాస్ అనే టైటిల్ తో అక్కడ సినిమాను తీయబోతున్నాను. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. త్వరలో అన్ని వివరాలను ప్రకటిస్తాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో విశ్వక్ గట్స్ కు చిత్ర పరిశ్రమ షాక్ అవుతుంది. ఇప్పుడున్న హీరోలందరూ పాన్ ఇండియా మూవీలు చేయాలి, స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవాలి అని పాకులాడుతుండగా.. విశ్వక్ మాత్రం విభిన్నంగా డైరెక్టర్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాను అందం విశేషం.. మరి ఈ మాస్ కా దాస్ బాలీవుడ్ లో ఎలాంటి వివాదం లేకుండా హిట్ ని అందుకుంటాడో లేదో..