మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈసారి ముందెన్నడూ చూడని విశ్వక్ సేన్ ని చూపించడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమా సినిమాకి మంచి వేరియేషన్స్ చూపిస్తున్న విశ్వక్ సేన్, తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా దాస్ కా ధమ్కీ సినిమాతో హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా కూడా హిట్ కొట్టాడు విశ్వక్. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసిన ఈ మూవీ తర్వాత విశ్వక్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘VS 11’ అనే వర్కింగ్ టైటిల్ లో అనౌన్స్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటివలే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిపొయింది.
“గంగానమ్మ జాతర మొదలయ్యింది … ఈ సారి శివాలెత్తిపోద్ది” అనే క్యాప్షన్ తో ఒక ఫోటోని పోస్ట్ చేసి మేకర్స్ ‘VS 11’ షూటింగ్ స్టార్ట్ అయిన విషయాన్ని తెలిపారు. ఈ ఫోటోలో విశ్వక్ సేన్ గుహ లాంటి సెటప్ లో కాగడా పట్టుకోని గంగమ్మ ముందు ఉన్నాడు. విశ్వక్ సేన్ సినిమాల్లో ఇప్పటివరకూ చూడని సెటప్ లో ‘VS 11’ తెరకెక్కుతుందని ఈ ఒక్క ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది. హీరోయిన్ ఇంకా అనౌన్స్ అవ్వని ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు. యువన్ అంటేనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కేరాఫ్ అడ్రెస్ కాబట్టి ‘VS 11’కి మంచి బీజీఎమ్ వినే ఛాన్స్ ఉంది. మరి తన లుక్ విషయంలో పూర్తిగా కొత్తగా కనిపించనున్న విశ్వక్ సేన్ ‘VS 11’ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.
గంగానమ్మ జాతర మొదలయ్యింది … ఈ సారి శివాలెత్తిపోద్ది 😎
A massy schedule begins for our #VS11 🔥🔥 @VishwakSenActor @thisisysr #KrishnaChaitanya @NavinNooli @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/P073xtM69B
— Sithara Entertainments (@SitharaEnts) May 13, 2023