సంక్రాంతి బరి నుండి తప్పుకొన్న ‘సామన్యుడు’ రిపబ్లిక్ డేకు వస్తుందని అప్పట్లో హీరో విశాల్ చెప్పాడు. అయితే… పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ తేదీన కూడా ‘సామాన్యుడు’ సినిమా విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విశాల్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా ద్వారా తు. ప. శరవణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే విశాల్…. యూనిక్ కంటెంట్ ఉన్న ‘సామాన్యుడు’ను తానే సొంతంగా నిర్మించడం విశేషం. ఇటీవల విడుదల చేసిన టీజర్ , ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిందని, అలాగే సెకండ్ సాంగ్ ‘మత్తెక్కించే’ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందని విశాల్ తెలిపాడు. డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా. తులసి, రవీనా రవి ముఖ్య పాత్రలు పోషించారు.