కోలీవుడ్ హీరో విశాల్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా “విశాల్ 31” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు తు పా శరవణన్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “విశాల్ 31” తెలుగు వెర్షన్ టైటిల్ ను “సామన్యుడు” అని పోస్టర్ ద్వారా ప్రకటించారు. “నాట్ ఎ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్‌లైన్.
Read Also : హనీ సింగ్ కు కోర్టు అక్షింతలు
పోస్టర్‌లో విశాల్ ఒక బేస్‌బాల్ బ్యాట్‌తో రౌడీల బ్యాచ్‌ని చితక్కొడుతున్నట్లుగా కన్పిస్తోంది. ఫస్ట్ లుక్ లో ఆయన సీరియస్ గా చూస్తున్నట్లు కన్పిస్తోంది. “సామాన్యుడు” చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి కథానాయిక. ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ నటులు యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.